Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:41 AM

అన్నక్యాంటీన్‌లలో భోజన ప్రమాణాలను పక్కాగా పాటించాలి:-జిల్లా కలెక్టర్

04-07-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

కదిరి పట్టణ కేంద్రంలోని కాలేజీ సర్కిల్ వద్ద నడుస్తున్న అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో పేదలకు అందుతున్న అల్పాహారం, భోజన వసతులను, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ఆహార పదార్థాలను పరిశీలించి, నాణ్యతను పరీక్షించారు. అనంతరం క్యాంటీన్‌కు వచ్చిన లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి, భోజనం ఎలా ఉంది ,సకాలంలో అందుతోందా, లేదా, అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించిందని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.క్యాంటీన్ లోపల, వంటగది పరిసర ప్రాంతాలలో పారిశుధ్యం కచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.పేదలకు సరఫరా చేసే భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మెనూ ప్రకారం అన్ని వంటకాలు రుచికరంగా అందించాలని క్యాంటీన్ నిర్వాహకులను హెచ్చరించారు.క్యాంటీన్ వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛమైన తాగునీటి సదుపాయాన్ని నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ రెడ్డి శేఖర్, రెవెన్యూ అధికారులు, క్యాంటీన్ నిర్వాహకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

అన్నక్యాంటీన్‌లలో భోజన ప్రమాణాలను పక్కాగా పాటించాలి:-జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News