Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 PM

దొడ్డి కొమరయ్య ఆశయాల సాధనకు కృషి చేస్తాం

04-07-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఉరుమడ్లలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహణ

చిట్యాల, జూలై 4:

చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఐతరాజు నరసింహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య రైతుల హక్కుల కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధన దిశగా కృషి చేస్తూ రైతు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు.

కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల బిక్షం, పల్లపు రామకృష్ణ, పల్లపు రాములు, కొయడి సత్యనారాయణ, వరికుప్పల విష్ణు, రూపని అంజయ్య, ఉయ్యాల సత్తమ్మ, రావుల లలిత తదితరులు పాల్గొని దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులర్పించారు.

Sthanikam

దొడ్డి కొమరయ్య ఆశయాల సాధనకు కృషి చేస్తాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News