Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:16 PM

కోదాడ మీదుగానే బుల్లెట్ రైలు నడపాలి: మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

24-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ పట్టణం మరియు నియోజకవర్గ భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని “బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చవద్దు – భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఈ బుల్లెట్ ట్రైన్ కోదాడ మీదుగానే వెళ్లాలి” అనే నినాదంతో కోదాడ పట్టణ పరిధిలోని పబ్లిక్ క్లబ్ నందు మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ –అమరావతి మధ్య ప్రతిపాదిత హైస్పీడ్ రైలు మార్గం విషయంలో ప్రస్తుతం అలైన్‌మెంట్ మార్పులు జరుగుతున్న నేపథ్యంలో కోదాడ ప్రజల భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కోదాడ మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లాలని కోరడం తన వ్యక్తిగత నిర్ణయం కాదని, ఇది కోదాడ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష, భవిష్యత్ తరాల అవసరం అని ఆయన స్పష్టం చేశారు. ఈ డిమాండ్‌కు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, వ్యాపార సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తదితర అన్ని వర్గాల ప్రతినిధులు అఖిలపక్ష సమావేశానికి హాజరై తమ మద్దతు తెలియజేయడం సంతోషకరమని అన్నారు. గతంలో హైదరాబాద్ – కోదాడ మధ్య ప్రయాణ పరిస్థితులను గుర్తు చేస్తూ, ఒకప్పుడు కోదాడ నుంచి హైదరాబాద్ వెళ్లాలన్నా, హైదరాబాద్ నుంచి కోదాడ రావాలన్నా సింగిల్ రోడ్డే ప్రధాన రవాణా మార్గంగా ఉండేదని, ఆ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, అప్పట్లో కోదాడ–హైదరాబాద్ ప్రయాణానికి కనీసం ఐదు గంటల సమయం పట్టేదని తెలిపారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో పోరాటాలు, ప్రజా ఉద్యమాల ఫలితంగా NH-65 వంటి డబుల్ లైన్ రహదారి సౌకర్యాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు అదే విధంగా భవిష్యత్ తరాల కోసం మెరుగైన రైలు రవాణా సౌకర్యాన్ని కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్–అమరావతి మధ్య హైస్పీడ్ రైలు అలైన్‌మెంట్ విషయంలో అవకాశం ఉన్నందున, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాత ప్రతిపాదిత మార్గంలోనే సూర్యాపేట–కోదాడ మీదుగా కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వే అలైన్‌మెంట్ నిర్ణయించేటప్పుడు కేవలం ప్రస్తుత పరిస్థితులను మాత్రమే కాకుండా భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ ప్రాంతంలో జనసాంద్రత పెరుగుతున్నదని, పారిశ్రామికంగా కూడా ప్రాంతం అభివృద్ధి చెందుతున్నదని ఆయన పేర్కొన్నారు. కోదాడ పరిసర ప్రాంతాల్లో సిమెంట్ పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు, విద్యాసంస్థలు ఉన్నాయని, వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. కోదాడ ప్రాంతంలో విద్యాసంస్థలు మరింత అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు విస్తరించాలన్నా, వ్యాపార కార్యకలాపాలు పెరగాలన్నా, ఉద్యోగులు మరియు విద్యార్థులకు మెరుగైన రవాణా సౌకర్యాలు ఎంతో అవసరమని అన్నారు. “కోదాడకు రైలు అవసరమా?” అనే ప్రశ్నకు సమాధానం రేపటి తరాల కోసం వందకు వంద శాతం అవసరం అని ఆయన స్పష్టం చేశారు.

కేవలం ప్రస్తుత తరం అవసరాల కోసం కాకుండా రాబోయే తరాల విద్య, ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారం, రవాణా, ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని హైస్పీడ్ రైలు అలైన్‌మెంట్‌ను నిర్ణయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన, రైల్వే శాఖపైన ఉందన్నారు. అదే విధంగా కోదాడ మీదుగా హైస్పీడ్ రైలు వెళ్లేలా సాధించేందుకు ప్రజలందరూ ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కోదాడకు హైస్పీడ్ రైలు సాధించే దిశగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందని, అందులో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, వ్యాపార సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు, యువత, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

Sthanikam

కోదాడ మీదుగానే బుల్లెట్ రైలు నడపాలి: మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News