Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:31 PM

వెంకటరమణ హీరో షోరూంలో అగ్నికీలలు

వెంకటరమణ హీరో షోరూంలో అగ్నికీలలు

వెంకటరమణ హీరో షోరూంలో అగ్నికీలలు
24-08-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్పేర్ పార్ట్స్ పూర్తిగా దగ్ధం.. భారీ ఆస్తినష్టం.

నల్లగొండ పట్టణంలోని వెంకటరమణ హీరో షోరూంలో ఆదివారం రాత్రి సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షోరూంలోని స్పేర్ పార్ట్స్ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించడంతో అక్కడ నిల్వ ఉంచిన ద్విచక్ర వాహనాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో షోరూంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే భారీ మొత్తంలో ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నప్పటికీ, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆటోమొబైల్ రంగానికి చెందిన కీలక స్పేర్ పార్ట్స్ నిల్వలు అగ్నికి ఆహుతి కావడంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Sthanikam

వెంకటరమణ హీరో షోరూంలో అగ్నికీలలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News