Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

చౌటుప్పల్ లో వంతెన పనులను వేగవంతం చేయాలి

24-08-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆర్‌డీవోకు వినతిపత్రం అందజేసిన బీఆర్‌ఎస్ నాయకుడు సుర్వి యాదయ్య గౌడ్

చౌటుప్పల్ పట్టణ పరిధిలో కొనసాగుతున్న జాతీయ రహదారి బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి, వాహనదారులు, ప్రజల ఇబ్బందులను తక్షణమే తొలగించాలని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు చౌటుప్పల్ ఆర్‌డీవోకు వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు వలిగొండ, మునుగోడు, నారాయణపూర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు బ్రిడ్జి పనుల వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ పెరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. నిర్మాణ ప్రాంతంలో సరైన బారికేడ్లు, రాత్రివేళల్లో వెలుతురు ఏర్పాటు చేసి, ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో పనులను వేగవంతం చేయాలని కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పనులను పూర్తి చేయించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్, మునుగోడు బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షులు నల్పరాజు రమేష్, మండల నాయకులు బోయ శ్రీరాములు, ధర్మోజిగూడెం గ్రామ అధ్యక్షులు బత్తుల సింహాద్రి, నారాయణపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ భిక్షం, గుజ్జ గ్రామ శాఖ అధ్యక్షులు సత్తయ్య, నాయకులు పొట్ట జంగయ్య, సుర్వి లింగస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ లో వంతెన పనులను వేగవంతం చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News