Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ లో వంతెన పనులను వేగవంతం చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 07:32 PM

టిబీ లక్షణాలపై అవగాహన.. గ్రామస్థులకు ఎక్స్‌రే పరీక్షలు

24-08-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం టిబీ వ్యాధిపై అవగాహన కార్యక్రమంతో పాటు ఎక్స్‌రే శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది టిబీ లక్షణాలు, నివారణ చర్యలు, చికిత్సపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. టిబీ పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని, వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడాలని తెలిపారు. టిబీని ముందస్తుగా గుర్తించేందుకు నిర్వహించిన ఎక్స్‌రే శిబిరాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది కోరారు. కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ రామకృష్ణ, టీబీ సూపర్‌వైజర్ ప్రకాశ్, ఎంఎల్‌హెచ్‌పీ ప్రతిభ, ఏఎన్‌ఎం శిల్ప, ఆశా కార్యకర్తలు ఏలిశమ్మ, పద్మ, పంచాయతీ కార్యదర్శి సంతోష్, ఉపసర్పంచ్ మొల్ల కరీం, మాజీ సర్పంచ్ నారాయణ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

టిబీ లక్షణాలపై అవగాహన.. గ్రామస్థులకు ఎక్స్‌రే పరీక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News