Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:39 AM

పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులేవీ?

పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులేవీ?

పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులేవీ?
23-08-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని సాగునీటి ప్రాజెక్టులు.

రైతులకు సాగునీరు అందక అడియాసలవుతున్న ఆశలు

29 నుంచి 31 వరకు సీపీఎం పాదయాత్ర.. చలో హైదరాబాద్‌

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు వెంటనే నిధులు కేటాయించి పూర్తి చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల్ల పెంటయ్య డిమాండ్‌ చేశారు. అరకొర నిధులు కేటాయిస్తూ అత్తెసరు పనులతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

బస్వాపూర్, గంధమల్ల, చర్లగూడెం వంటి బహుళార్థసాధక ప్రాజెక్టులు నిధుల కొరతతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీటిని త్వరగా పూర్తి చేస్తే జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువల పనులు నిధుల విడుదలలో జాప్యంతో అర్ధంతరంగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.

పురాతనమైన ఆసిఫ్‌నహర్, బృందావన్‌ కాలువలను పునరుద్ధరించాలన్న ప్రజల డిమాండ్‌ పట్టించుకునే నాథుడే లేరని విమర్శించారు. శామీర్‌పేట చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి భువనగిరి ప్రాంతానికి నీరందిస్తామన్న ప్రతిపాదన కూడా నీరుగారిపోయిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తగినన్ని నిధులు విడుదల చేసి నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సాగు, తాగునీటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 29, 30, 31 తేదీల్లో సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 31న ఇందిరాపార్క్‌ వద్ద జరిగే మహాధర్నాకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

రామన్నపేట మండలంలో వేలాది మంది సన్న, చిన్నకారు, మధ్యతరగతి రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. పెండింగ్‌ కాలువలకు వెంటనే బడ్జెట్‌ కేటాయించి పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ నీర్నేముల, వెల్లంకి, సిరిపురం, సర్నేనిగూడెం, కొమ్మాయిగూడెం, శోభనాద్రిపురం గ్రామాల్లో పోస్టర్‌ ఆవిష్కరణలు నిర్వహించారు. కార్యక్రమాల్లో బోయిన ఆనంద్, కూరెళ్ల నరసింహాచారి, వనం ఉపేందర్, నాగటి ఉపేందర్, నాగటి లక్ష్మణ్, గోగు లింగస్వామి, కర్రె సంతోష్, బర్ల బాబురావు, బండ జగన్మోహన్‌రెడ్డి, గంగదేవి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులేవీ?

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News