Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:43 AM

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. రేపటి బంద్‌ను విజయవంతంచేయాలి.

23-08-2026 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ IFTU, CITU, AITUC, BRTU సంఘాల ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ పట్టణంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఎన్‌జీ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఆటోలు పాల్గొన్నాయి. అనంతరం నిర్వహించిన సభలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు.

ఆర్‌టీసీ రంగంలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టడం వల్ల సంప్రదాయ ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఈవీ ఆటోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా కల్పించాలని కోరారు. ప్రమాదాలకు గురైన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏళ్లు దాటిన ఆటో కార్మికులకు నెలవారీ పింఛన్‌ అందించాలని డిమాండ్‌ చేశారు.

తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆదివారం నిర్వహించనున్న ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్మికులంతా ఐక్యంగా బంద్‌లో పాల్గొనాలని కోరారు.

కార్యక్రమంలో IFTU జిల్లా అధ్యక్షుడు బి.నర్సింహ, కార్యదర్శి బొమ్మిడి నగేష్, AITUC నాయకుడు లెనిన్ కేస్‌రెడ్డి, CITU జిల్లా సహాయ కార్యదర్శి అవుట రవీందర్, అద్దంకి నరసింహ, హనుమంతు నాయక్, BRTU జిల్లా కార్యదర్శి గుర్రం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. రేపటి బంద్‌ను విజయవంతంచేయాలి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News