Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:40 AM

నేరాల కట్టడికి సీసీ కెమెరాలు కీలకం.డీఎస్పీ

23-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీసీ కెమెరాలతో నేరస్తులకు చెక్‌.. ప్రజల భద్రతకు భరోసా

నల్గొండ: ప్రజా భద్రతకు సీసీ కెమెరాలు రక్షణ కవచంలా పనిచేస్తాయని నల్గొండ సబ్‌డివిజన్ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నల్గొండ టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 18వ వార్డులో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్లు గడిగ హిమబిందు, గడిగ శ్రీను సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, నేరస్తులను త్వరగా గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు.

టూ టౌన్ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే కమ్యూనిటీ పోలీసింగ్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్‌ఐ సైదాబాబు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గడిగ హిమబిందు, గడిగ శ్రీనులను పోలీసు అధికారులు అభినందించారు.

Sthanikam

నేరాల కట్టడికి సీసీ కెమెరాలు కీలకం.డీఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News