Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:42 AM

అమ్మవారి విగ్రహాలే టార్గెట్‌.. ఇద్దరు మహిళల అరెస్ట్

22-08-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి: ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన చిన్న ఆలయంలోని దుర్గామాత విగ్రహాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సరూర్‌నగర్ పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్టు చేసి, చోరీకి గురైన రెండు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇందిరమ్మ తన నివాసంలో దుర్గామాత ఆలయాన్ని ఏర్పాటు చేసి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న పొరుగింటికి చెందిన సింగిశెట్టి లక్ష్మీబాయి ఆలయంలో దీపం వెలిగించారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరిగి దీపం వెలిగించేందుకు వెళ్లగా విగ్రహాలు కనిపించకపోవడంతో ఇందిరమ్మకు సమాచారం ఇచ్చారు.

అంబటి సంతోష్‌కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కదమంచి రాములమ్మ, ఉబడి వెంకటమ్మలను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు దుర్గామాత విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీశైలం తెలిపారు.

Sthanikam

అమ్మవారి విగ్రహాలే టార్గెట్‌.. ఇద్దరు మహిళల అరెస్ట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News