సిరిపురం: సిరి మెటల్స్ ఏర్పాటు పేరుతో భూములను నాశనం చేయొద్దని ప్రశ్నించిన రైతులపై దాడి చేసి, ట్రాక్టర్, వ్యవసాయ భూమిలోని గుడిసెను ధ్వంసం చేయడంతోపాటు 10 మంది నిర్దోషులపై అక్రమంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం దారుణమని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి అన్నారు. రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సిరిపురంలో సిరి మెటల్స్ సంస్థ ఏర్పాటు విషయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లడం సరికాదన్నారు. రాజకీయ పలుకుబడితో సంస్థ యాజమాన్యం రైతులపై దౌర్జన్యానికి పాల్పడటం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా నిర్దోషులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
రైతు బల్గురి మల్లేష్‌కు చెందిన ట్రాక్టర్, వ్యవసాయ భూమిలోని గుడిసె ధ్వంసం చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ట్రాక్టర్ ధ్వంసానికి బాధ్యులైన సిరి మెటల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని, రైతుకు జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఘటనపై వాస్తవాలను పరిశీలించి నిర్దోషులపై బనాయించిన కేసులను రద్దు చేయాలని కోరారు.
రైతుల భూములు, జీవనోపాధి, భవిష్యత్తుకు నష్టం కలిగించే చర్యలను సహించేది లేదని అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించకుండా రైతులపై కేసులు, దౌర్జన్యాలు కొనసాగిస్తే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు. సిరి మెటల్స్ ఏర్పాటు అంశంపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను కోరారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బడుగు రమేష్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బల్గురి అంజయ్య, కందుల మల్లారెడ్డి, శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, నాయకులు కునూరు గణేష్, అంబటి సురేందర్‌రెడ్డి, భారత మృత్యుంజయ, రాపోలు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి