Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రూపా రెడ్డి హత్యకు నిరసనగా కదిలిన విద్యా సమాజం నల్లగొండలో TRSMA ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీ.. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 11:59 PM

విద్యార్థుల భవిష్యత్తుకు చెడు వ్యసనాలు పెనుముప్పు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి: డీవైఎఫ్‌ఐ

21-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలు, ఇతర చెడు వ్యసనాలకు గురికాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.

పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌లో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రూపారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు, కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేసిన ఒక విద్యావేత్తను కోల్పోవడం సమాజానికి తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మల్లం మహేష్ మాట్లాడుతూ.. ఒక విద్యావేత్తగా, సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా విద్యార్థుల అభ్యున్నతి కోసం పనిచేసిన రూపారెడ్డి మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లోని విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, మంచి ఆలోచనా విధానాన్ని అలవర్చాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో యువతను మత్తు పదార్థాల వైపు ఆకర్షించే ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. విద్యార్థుల్లో ప్రవర్తనలో వచ్చే మార్పులను ఉపాధ్యాయులు గుర్తించి, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తన, స్నేహితుల పరిచయాలు, రోజువారీ కార్యకలాపాలపై నిరంతరం దృష్టి పెట్టాలని మహేష్ సూచించారు. పిల్లలతో భయపెట్టి కాకుండా స్నేహపూర్వక వాతావరణంలో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. విద్యార్థులు ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నప్పుడు దానిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పంచుకునే విధంగా నమ్మకమైన వాతావరణాన్ని కల్పించాలని కోరారు.

మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టడంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మత్తు పదార్థాల సరఫరాను పూర్తిగా అరికట్టాలని అన్నారు.

యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడం ఒక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని మహేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు సమిష్టిగా కృషి చేసినప్పుడే విద్యార్థుల భవిష్యత్తును కాపాడగలమన్నారు. రూపారెడ్డి హత్యకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షులు కట్ట ప్రభాత్, నల్లగొండ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పాలాది కార్తీక్, గుండాల నరేష్, నాయకులు కార్లపూడి రాము, మాదాసు రావణ్, యువరాజ్, వేణుచారి, శ్రీకాంత్, కిరణ్, నాగేష్, కుమార్, రఘు, అనిల్, యశ్వంత్, గిరి, శ్రవణ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల భవిష్యత్తుకు చెడు వ్యసనాలు పెనుముప్పు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి: డీవైఎఫ్‌ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News