Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

వెనుక నుంచి కారు ఢీ.. లారీ కిందపడి యువకుడు మృతి

09-08-2026 799 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బాల నరసింహ స్వామి దేవాలయ టర్నింగ్‌ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నీర్నాముల గ్రామానికి చెందిన ముత్యాల శివ (34) చిట్యాల నుంచి భువనగిరి వైపు వెళ్తున్నాడు. బాల నరసింహ స్వామి దేవాలయ టర్నింగ్‌ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన కారు అతని వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిపారు. దీంతో అదుపుతప్పిన శివ ఎదురుగా వస్తున్న లారీ కింద పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు.

సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Sthanikam

వెనుక నుంచి కారు ఢీ.. లారీ కిందపడి యువకుడు మృతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News