Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి కంటే పట్టుదల ముఖ్యం.. వెస్టీజ్ మార్కెటింగ్‌లో అభివృద్ధికి అవకాశం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 09:12 PM

ఘనంగా ర్యాకల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

ఘనంగా ర్యాకల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

ఘనంగా ర్యాకల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
08-08-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ జన్మదిన వేడుకలను పార్టీ పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాకల శ్రీనివాస్‌తో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ర్యాకల శ్రీనివాస్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజా సేవలో మరింత ముందుకు సాగి రాజకీయ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానం, నమ్మకాన్ని ఎప్పటికీ మరువలేనన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.

కార్యక్రమంలో భువనగిరి మండల అధ్యక్షుడు జనగాం పాండు, పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్, నీల ఓం ప్రకాష్‌గౌడ్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ బల్గూరి మధుసూదన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఏనబోయిన ఆంజనేయులు, మాజీ జడ్పీటీసీలు బీరు మల్లయ్య, సందెల సుధాకర్, మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్, సర్పంచ్ జక్క రాఘవేందర్‌రెడ్డి, కస్తూరి పాండు, బాతుక అశోక్, కుతాడి సురేష్, మూలే నాగేంద్రబాబు, కంకల మహేష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా ర్యాకల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News