Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:25 AM

తల్లిపాలే పసికందులకు తొలి రక్షణ కవచం.

తల్లిపాలే పసికందులకు తొలి రక్షణ కవచం.

తల్లిపాలే పసికందులకు తొలి రక్షణ కవచం.
08-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి: తల్లిపాలు ఇవ్వడం వల్ల పసికందుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తల్లిపాలే వారికి తొలి రక్షణ కవచమని వైద్యాధికారి రవి తెలిపారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని తిరుమలగిరి మండలం మామిడాల అంగన్‌వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆరోగ్య సేవా ప్రదాత (ఎం.ఎల్.హెచ్.పి) రవి మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తప్పనిసరిగా పట్టించాలని సూచించారు. తల్లిపాలు బిడ్డల శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. బాలింతలకు కుటుంబ సభ్యులు తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ బొడ్డు సర్పంచ్ సైదులు,కార్యదర్శి మధు, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.అనిత,అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు రమాదేవి,ఆరోగ్య కార్యకర్త యశోద, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు మణెమ్మ, విజయలక్ష్మి,మార్కు, గర్భిణులు, బాలింతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

తల్లిపాలే పసికందులకు తొలి రక్షణ కవచం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News