Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:12 PM

ఫుట్‌పాత్‌లపై మటన్‌, చేపల విక్రయాలకు చెక్‌!

08-08-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. మున్సిపల్‌ కమిషనర్‌ బి.వంశీకృష్ణ హెచ్చరిక.

అనుమతి, లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లోనే మాంసం విక్రయాలు.

రోడ్లు, ప్రజా ప్రదేశాల్లో విక్రయాలు నిషేధం.. ఆదివారాల్లో ప్రత్యేక నిఘా

వ్యర్థాలను రోడ్లు, డ్రైన్లలో వేస్తే చర్యలు తప్పవు.

నగరపాలిక: ఫుట్‌పాత్‌లు, రోడ్లు, ప్రజా ప్రదేశాలను ఆక్రమించి మటన్‌, చేపల విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ బి.వంశీకృష్ణ హెచ్చరించారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం అనుమతి, లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లో మాత్రమే మాంసం విక్రయాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

ప్రత్యేకంగా ఆదివారాల్లో ఫుట్‌పాత్‌లపై మటన్‌, చేపల విక్రయాలు జరగకుండా మున్సిపల్‌ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోడ్లు, డ్రైన్లలో మాంస వ్యర్థాలను పడేయడం ద్వారా పారిశుధ్యం, ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై వ్యాపారం నిలిపివేయడంతో పాటు ఆక్రమణలను తొలగిస్తామని కమిషనర్‌ పేర్కొన్నారు. అవసరమైతే దుకాణాలను సీజ్‌ చేసి, విక్రయ సామగ్రిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్‌పై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకుండా ప్రతి ఒక్కరూ మున్సిపల్‌ నిబంధనలు పాటించాలని కమిషనర్‌ బి.వంశీకృష్ణ సూచించారు.

Sthanikam

ఫుట్‌పాత్‌లపై మటన్‌, చేపల విక్రయాలకు చెక్‌!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News