Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం

విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం

విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం
07-08-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు

మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటిచూపు సమస్యలతో బాధపడకూడదనే లక్ష్యంతో స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 'కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్' ద్వారా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రసిద్ధ శంకర్ నేత్రాలయ వైద్య నిపుణుల భాగస్వామ్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత నేత్ర పరీక్షలు చేపడుతున్నారు. ​శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని త్రినిటీ విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి, పలువురికి తగు వైద్య సూచనలు అందజేశారు. శంకర్ నేత్రాలయ వైద్యులు డాక్టర్ కే. నవ్య, డాక్టర్ ఏ. మధు, డాక్టర్ ఏ. స్వప్న పాల్గొని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.​ఈ సందర్భంగా త్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ కే.వి.బి. కృష్ణారావు, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జయిని మంజుల మాట్లాడుతూ.. అంధత్వ నివారణే ధ్యేయంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. విద్యార్థి దశలోనే కంటి సమస్యలను గుర్తించడం వల్ల వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News