Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:02 PM

ఆరోగ్యశ్రీ వెనుక ఎమ్మార్పీఎస్ పోరాటమే.. బత్తిని సుధాకర్ మాదిగ

07-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్, ఆగస్టు 7

పేదలు, దివ్యాంగులకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం అమలులోకి వచ్చిందని ఎమ్మార్పీఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తిని సుధాకర్ మాదిగ పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ పథకం అమలు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎల్బీనగర్‌లోని మహనీయుల విగ్రహాల వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బత్తిని సుధాకర్ మాదిగ మాట్లాడుతూ, పేదలు, దివ్యాంగులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందించాలనే డిమాండ్‌తో మంద కృష్ణ మాదిగ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆ ఉద్యమాల ప్రభావంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007 ఆగస్టు 7న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేలాది మంది నిరుపేదలు ఖరీదైన వైద్య చికిత్సలను ఉచితంగా పొందుతూ ప్రాణాలను కాపాడుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బీజేఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం. రాజు మాదిగ, గిరి మాదిగ, యాదయ్య మాదిగ, చంటి మాదిగ, క్రాంతి కుమార్ మాదిగ, హుస్సేన్ మాదిగ, రంగన్న మాదిగ, బీసీ నాయకులు భీమ్‌రావు, గోపిశివ, రాము మాదిగ, కాశీ మాదిగ, బుజ్జి మాదిగ, దేవా మాదిగ, పవన్ మాదిగ, చరణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆరోగ్యశ్రీ వెనుక ఎమ్మార్పీఎస్ పోరాటమే.. బత్తిని సుధాకర్ మాదిగ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News