విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్.
తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలోని ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని వారు పేర్కొన్నారు.
పాఠశాల ప్రాంగణంలో నిలిచిన నీటిని తక్షణమే తొలగించాలని, భవిష్యత్తులో వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులు చదువుకోవాల్సిన పాఠశాల ప్రాంగణం చెరువును తలపించేలా మారడం బాధాకరమన్నారు.
అధికార పార్టీ చొరవ చూపాలి.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని పాఠశాల ప్రాంగణంలోని నీటి సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని వారు కోరారు. కేవలం నీటిని తొలగించడం కాకుండా, వర్షపు నీరు తిరిగి నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నలగట్టు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ మండల కౌన్సిల్ సభ్యుడు, మాజీ సర్పంచ్ వీరబోయిన శ్రీనివాస్,ఏడవ వార్డు బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి షేక్ ఆసిఫ్, గ్రామ 12వ వార్డు సభ్యుడు కుదుర్ల మధు, టీఆర్‌ఎస్ యువజన నాయకుడు నక్క శ్రీను తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి