Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:12 PM

చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ గా బీరెల్లి వెంకటరెడ్డి

07-08-2026 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా.

నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్‌స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా బీరెల్లి వెంకటరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చిట్యాల ఎస్సైగా విధులు నిర్వహించిన మామిడి రవికుమార్ నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయానికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో వెంకటరెడ్డిని నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సై వెంకటరెడ్డి మాట్లాడుతూ చిట్యాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసులను సంప్రదించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.

పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.

Sthanikam

చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ గా బీరెల్లి వెంకటరెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News