Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:00 PM

మూసీలో మిస్టరీ డెత్.. గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం.

07-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగోల్ పరిధిలో ఘటన.. ఆత్మహత్యా? లేక ప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు

చైతన్యపురి: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసీనదిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్, నాగోల్ సర్కిల్ పరిధిలోని గౌరెల్లి–ప్రతాప్ సింగారం మూసీ వంతెన సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలియాడుతుండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మూసీ నది నుంచి వెలికితీశారు. మృతుడు సుమారు 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువకుడిగా ప్రాథమికంగా గుర్తించారు. అతడు నీలిరంగు జీన్స్ ప్యాంట్, గోధుమరంగు షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన ఆత్మహత్యా? లేక మూసీ ప్రవాహంలో కొట్టుకువచ్చాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సెక్టార్ ఎస్‌ఐ రమేష్ తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Sthanikam

మూసీలో మిస్టరీ డెత్.. గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News