Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారీ వర్షాలు.. నేడు పాఠశాలలకు సెలవు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 24, 2026 11:14 AM

విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు

07-08-2026 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విదేశీ నిధులు స్వీకరించే స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల్లో మరింత పారదర్శకత తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు విదేశీ నిధులు పొందే ప్రతి సంస్థ తమ సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలను వెల్లడించడంతో పాటు, ఆ నిధులతో నిర్వహించే ప్రచార కార్యక్రమాలపై కూడా పూర్తి సమాచారాన్ని అందించాల్సి ఉండేలా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.ప్రతిపాదిత మార్పుల ప్రకారం విదేశీ నిధులతో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నిధులు ఏ పని కోసం వినియోగించారు, ఎక్కడ ఖర్చు చేశారు, ఎవరికి ప్రయోజనం చేకూరింది, నిధుల అసలు మూలం ఏమిటి వంటి వివరాలను స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే సామాజిక మాధ్యమాల్లో విదేశీ నిధులతో నిర్వహించే ప్రచార కార్యక్రమాల వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.

డిజిటల్ వేదికల ద్వారా విదేశీ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, నిధుల వినియోగాన్ని మరింత సమర్థంగా పర్యవేక్షించడం, పారదర్శకతను పెంచడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యంగా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నిధుల లావాదేవీలపై మాత్రమే ప్రధానంగా నిఘా ఉండగా, ఇకపై ఆ నిధులతో జరిగే ప్రచార కార్యక్రమాలపై కూడా పర్యవేక్షణ పెరగనుంది.ఈ మార్పులు అమల్లోకి వస్తే విదేశీ నిధుల వినియోగంపై మరింత స్పష్టత ఏర్పడటంతో పాటు, నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి.

Sthanikam

విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News