సత్యసాయి తాగునీటి కార్మికులకు వైసీపీ మద్దతు
సత్యసాయి తాగునీటి కార్మికులకు వైసీపీ మద్దతు
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా,కొత్తచెరువు మండలం లో శ్రీ సత్యసాయి పంప్ హౌస్ వద్ద గత ఐదు నెలల బకాయి పడిన వేతనాలు చెల్లించాలని, ఉద్యోగభద్రత కల్పించి, శ్రీ సత్యసాయి తాగునీటి పథకాన్ని జడ్పిలో విలీనం చెయ్యకుండా బోర్డు ద్వారా నిర్వహించాలని ధర్నా చేస్తున్నా శ్రీ సత్యసాయి వాటర్ సప్లై కార్మికులకు సంఘీభావంగా వైస్సార్సీపీ పుట్టపర్తి నియోజకవర్గం సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా ఆవుటల రమణ రెడ్డి మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఎంతో ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా వేలాది గ్రామాలు, వందలాది మండలాలకి త్రాగునీటిని అందిస్తూ లక్షలాది మంది దాహర్తి తీరుస్తున్న ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వము నిర్లక్ష్యం చెయ్యడం తగదని, గతంలో యువగలం పాదయాత్రలో ఈ పథకాన్ని దత్తత తీసుకుంటాను అని చెప్పిన నారా లోకేష్ , ఈ పథకాన్ని దత్తత తీసుకోవడం దేవుడెరుగుకాని 2026-27 బడ్జెట్ లో ఈ పథకానికి ఒక్క రూపాయి కేటాయించకపోవడం చూస్తుంటే ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చెయ్యాలని చూస్తున్నట్లు ఉందని, అలాంటి ఆలోచనలు ఏమైనా తక్షణమే విరమించుకొని కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని, ఇప్పటికే అనేక గ్రామలు శ్రీ సత్యసాయి త్రాగునిరు అందాక ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యని వెంటనే పరిష్కరించాకపోతే రాబోవు రోజులలో కార్మికులకు, ప్రజలకు మద్దతుగా YSRCP పార్టీ తరపున ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తచెరువు మండల కన్వీనర్ శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిఆవుటల రమణారెడ్డి గారు, మాజీ ఎంపీపీ గాయత్రి రెడ్డప్ప రెడ్డిరాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రెటరీ పాదయాత్ర వాల్మీకి శంకర్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఎం నారాయణ, వైస్ ఎంపీపీ గంగరాజునియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డి, నియోజకవర్గడాక్టర్ వింగ అధ్యక్షుడుహనుమంత రెడ్డి ఎంపీటీసీ కృష్ణారెడ్డి రమణారెడ్డి ఆవుల అశోక్ YSRCP సోషల్ మీడియా కార్యదర్శి చెనరాయుడు మహిళా విభాగం జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఆలకుంట్ల అశ్వినిSC జిల్లా కార్యవర్గ సభ్యుడు తలమర్ల రామాంజనేయులు. వెంకట రామిరెడ్డి. అస్వర్తరెడ్డి. శ్రీనివాసులు,మండల పంచాయతి రాజ అధ్యక్షుడు తిప్పారెడ్డిమండల బీసీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ మండల మహిళా అధ్యక్షురాలు ప్రభావతమ్మ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రామాంజనేయులు, YSRCP సీనియర్ నాయకుడు డేరంగుల వెంకట్రాముడు పెయింటర కేశవ బేల్దారి ఎల్లప్ప. బళ్లారి బాబువిజయ్ కుమార్ పాముదుర్తి సనరవీందర్ రెడ్డి, రమణారెడ్డి గోపాల్ రెడ్డి గంగులప్ప చాకలి సూరి నారేపల్లి మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి సంజీవ రాయుడు మండలయూత్ ఉపాధ్యక్షుడు బళ్లారి గణేషసోషల్ మీడియా గ్రామ కమిటీ అధ్యక్షుడు ఒలిపి సుదర్శనమ, గ్రామ కమిటీ యూత్ అధ్యక్షుడు, లక్కే శివ రామ రామవిద్యార్థి విభాగం అధ్యక్షుడు, నామాల విష్ణు, ,YSRCP నాయకులు, YSRCPఅనుబంధ సంఘాల నాయకులు, YSRCP కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి