Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోటకొండూరులో బీఆర్‌ఎస్‌కు జోష్‌.. హరీష్‌రావుకు ఘన స్వాగతం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 05:06 AM

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ :- సిపిఐ

06-06-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద శనివారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మరియు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి. కదిరప్ప, సిపిఐ పట్టణ కార్యదర్శి ఇలియాత్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాల వల్ల సామాన్య ప్రజలు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

దేశంలో ఇప్పటికే నిరుద్యోగం, పేదరికం, ఉపాధి కొరత వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూ ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావంతో రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయలు, పప్పుధాన్యాలు, వంటనూనెలు, బియ్యం తదితర నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయని పేర్కొన్నారు.

రోజువారీ కూలి పనులు చేసుకుని జీవించే కార్మిక కుటుంబాలు రెండు పూటల భోజనం కూడా సమకూర్చుకోవడం కష్టంగా మారిందన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని, విద్యుత్ ఛార్జీలు, విద్య, వైద్య ఖర్చులు కూడా పెరగడంతో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు రాయితీలు కల్పిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ సిపిఐ నాయకులు ఆదినారాయణ భాస్కర్ బషీర్ బాబావలి ఇలియాకత్ శంకర్ రజియా సోఫియా తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ :- సిపిఐ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News