Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:19 AM

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
10-06-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు శాఖ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నల్లమాడ మండలంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కదిరి–బెంగళూరు జాతీయ రహదారిపై పులగంపల్లి క్రాస్ సమీపంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు AP39 SA 7507 నంబర్ గల హ్యుందాయ్ వేర్న కారును ఆపి పరిశీలించగా, డిక్కీలోని రెండు మూటలలో 24 ప్యాకెట్లలో సుమారు 53 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.

ఈ కేసులో బి. వెంకట రమణ (25) ను అరెస్ట్ చేసి, గంజాయి, కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు మల్లికార్జున పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

ఈ కేసు వివరాలను పుట్టపర్తి ఇన్‌ఛార్జ్ డీఎస్పీ శివన్నారాయణ స్వామి, నల్లమాడ సీఐ శ్రీనివాసులు తో కలిసి మీడియాకు వెల్లడించారు.మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు మరియు వినియోగంపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగుతాయి అని పోలీసులు హెచ్చరించారు. నేర నియంత్రణలో అప్రమత్తంగా పనిచేస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు శాఖకు అభినందనలు తెలిపారు.

Sthanikam

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News