Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:45 AM

మాకు న్యాయం చేయండి మహాప్రభు- వాటర్ ప్లాంట్ కార్మికులు

19-05-2026 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో 15వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఎర్రటి ఎండలో పొర్లు దండాలు పెడుతూ మా మొర ఆలకించండి మహాప్రభో పెండింగ్ జీతాలు చెల్లించండి అంటూ వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేశారు. ఐదు నెలలగా మా కడుపులో మాడుతున్నాయి.. ఇప్పుడు మండు టెండలో మా బాధలు చూసైనా కనికరించండి అంటూ వేడుకున్నారు. సంక్షేమ పథకాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం గ్రామ గ్రామానికి నీరు అందిస్తున్న మా సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు చిన్నచూపు చూస్తోందో అర్థం కావడం లేదన్నారు. ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో మా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని చేసిన అప్పులు తీర్చుకోలేక సతమతమవుతున్నామని వాపోయారు. బోర్డు ఆధీనంలోనే సత్యసాయి తాగునీటి పథకం కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించినప్పటికీ ఆయన ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో చలో అమరావతి కార్యక్రమం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

Sthanikam

మాకు న్యాయం చేయండి మహాప్రభు- వాటర్ ప్లాంట్ కార్మికులు

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News