Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువు ఋణం తీర్చుకున్న శిష్యుడు! ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 09:48 PM

నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్

నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్

నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్
June 30, 2026 08:26 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం శాంతేబీదనూరు గ్రామంలో 16-06-2023న జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయి సురేష్ అలియాస్ సూరికి హిందూపురం సెషన్స్ కోర్టు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

కేసు వివరాలు

బాధితుడు చంద్రశేఖర్ కు తన భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ముద్దాయి సురేష్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో 16-06-2023 సాయంత్రం సుమారు 7:45 గంటలకు బాధితుడిపై కత్తితో దాడి చేసి తొడ మరియు ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలు కలిగించాడు. రక్తస్రావంతో గాయపడిన చంద్రశేఖర్‌ను మొదట హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై బాధితుని తల్లి కరగాసం పార్వతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం.132/2023గా కేసు నమోదు చేసి భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 307 కింద దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను సేకరించి దర్యాప్తును పూర్తి చేసి 08-09-2023న కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అనంతరం కేసు PRC No.48/2023గా విచారణకు స్వీకరించబడింది.

విచారణలో సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన గౌరవనీయులైన హిందూపురం సెషన్స్ న్యాయస్థానం ముద్దాయిని దోషిగా నిర్ధారిస్తూ 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధించింది.

ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి న్యాయస్థానంలో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించేందుకు కృషి చేసిన దర్యాప్తు అధికారులు సీఐ ఆంజనేయులు, ఎస్సై ఆజాద్ భాష, కోర్టు మానిటరింగ్ సీఐ ఇస్మాయిల్, ప్రభుత్వ అభియోగ అధికారి (పీపీ) గోపాలకృష్ణ, కోర్టు మానిటరింగ్ విభాగం హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములులను జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ అభినందించారు.

జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నేరం చేసిన నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News