Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

మృతి చెందిన కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం

05-08-2026 208 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చిన్నకొండూర్​లో బాధిత కుటుంబానికి రూ.10 వేల సాయం అందించిన సీఐటీయూ

కార్మికులకు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: మేకల శ్రీశైలం, గరిశే నరసింహ

అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడు చెక్క పావయ్య కుటుంబాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) నాయకులు పరామర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామానికి చెందిన పావయ్య కుటుంబ సభ్యులకు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.​ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మేకల శ్రీశైలం ముదిరాజ్, కార్యదర్శి గరిశే నరసింహ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తమ సంఘం పనిచేస్తోందని తెలిపారు. కష్టకాలంలో ఉన్న కార్మిక కుటుంబాలకు తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, పావయ్య కుటుంబానికి సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు చెక్క శ్రీను, చెక్క యాదయ్య, చీమలకొండల శ్రీరాములు, బక్కి శ్రీనివాస్, పగడాల భిక్షం, ఎర్రోళ్ల స్వామి, నెల్ల సాయిలు, చెక్క భిక్షపతి, చెక్క రామచంద్రం, చీమలకొండల కృష్ణ, ఎండి అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మృతి చెందిన కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News