Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:12 PM

స్విమ్మింగ్ పూల్ నిర్వాహకునికి భారీ జరిమానా

05-08-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని శివగంగా స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఒక యువకుడు మృతి చెందిన ఘటనలో నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం ఏభై రెండు లక్షల పదకొండు వేల రూపాయలు పరిహారం చెల్లించాలని సంచలన తీర్పునిచ్చింది. ​చిట్యాల మండలం వట్టిమర్రి గ్రామానికి చెందిన నూనే శ్రవణ్‌కుమార్, 2024 ఏప్రిల్ 15న తన స్నేహితులతో కలసి చిట్యాల శివారులో ఉన్న శివగంగా స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న సమయంలో శ్రవణ్‌కుమార్‌కు తలకు తీవ్ర గాయమై నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతడిని బయటకు తీసి నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ​ఈ దుర్ఘటనపై మృతుడి తండ్రి నూనే సంజీవ చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు ఎటువంటి భద్రతా చర్యలు పాటించలేదని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విచారణలో తేలింది. ​బాధిత కుటుంబం న్యాయం కోసం నల్గొండ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. న్యాయవాదులు శేపూరి మధుసూదన్, ఎస్. పూర్ణచందర్‌లు బాధిత కుటుంబం తరఫున రూ. 50,00,000/- పరిహారం ఇప్పించాలని వాదనలు వినిపించారు.

​ఇరుపక్షాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం చైర్‌పర్సన్ శ్రీ మామిడి క్రిస్టోఫర్, సభ్యులు సంధ్యారాణి, వెంకటేశ్వర్లు.. స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారంగా రూ. 52,11,000/- లను 45 రోజులలోపు చెల్లించాలని స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులను ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.

Sthanikam

స్విమ్మింగ్ పూల్ నిర్వాహకునికి భారీ జరిమానా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News