Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:00 PM

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ.

05-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఓటీపీ, బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచాలి..

సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి

సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ సూచించారు. సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ మాట్లాడుతూ.. ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ వంటి గోప్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వచ్చే నకిలీ ఆఫర్లతో పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సకాలంలో ఫిర్యాదు చేస్తే నష్టాన్ని నివారించే అవకాశం

సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు ఫోన్ చేయడంతో పాటు cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సీఐ సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలతో పాటు బాధితులకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సి. ఉదయ్ కిరణ్, అధ్యాపకులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు సైబర్ నేరాల నివారణ, వ్యక్తిగత సమాచార భద్రత, ఆన్‌లైన్ మోసాల గుర్తింపు వంటి అంశాలపై అవగాహన పొందారు.

Sthanikam

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News