Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:04 AM

గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

05-08-2026 205 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పింఛన్ పెంపు, ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్

ఎన్నికలు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

అమరవీరుల స్ఫూర్తితో ఈ నెల 2న మహబూబాబాద్‌లో ప్రారంభమైన గీతన్నల చైతన్య యాత్ర బుధవారం సూర్యాపేటకు చేరుకుంది. ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద యాత్రకు ఘన స్వాగతం పలికిన అనంతరం పీఎస్‌ఆర్ సెంటర్, పూల సెంటర్, పోస్టాఫీస్, కోర్టు సెంటర్, పాత బస్టాండ్ మీదుగా తాటి, ఈత కొమ్మలు చేతబట్టి భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో బహిరంగ సభ జరిగింది.

ఈ సందర్భంగా బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, 50 సంవత్సరాలు దాటిన గీత కార్మికులందరికీ నెలకు రూ.4 వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. తాటి చెట్టుపై నుంచి పడి మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. రాష్ట్రంలోని తాటి, ఈత చెట్లకు సంఖ్యలు కేటాయించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, చెట్లను నరికివేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రతి గీత సహకార సంఘానికి ఐదు ఎకరాల భూమి కేటాయించి, కంచె, సాగునీటి సౌకర్యాలు కల్పించాలని, తాటి, ఈత, ఖర్జూర మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. వృత్తిలో ఉన్న ప్రతి గీత కార్మికుడికి రక్షణ పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు.

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ మాట్లాడుతూ, నీరా పథకం కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. నందనం, సర్వేల్, చారుకొండ, మునిపల్లి ప్రాంతాల్లో నిర్మించిన నీరా సేకరణ కేంద్రాలను ప్రారంభించాలని, ప్రతి జిల్లాలో తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆగస్టు 18న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, సర్వాయిపేట, తాటికొండ, కిలాసాపురం కోటలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లా అధ్యక్షుడు ఎల్గూరి గోవిందు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర నాయకులు చౌగాని సీతారాములు, గౌని వెంకన్న, కొండం కరుణాకర్, మడ్డి అంజిబాబు, గౌని సాంబయ్య, జిల్లా నాయకులు తుమ్మల సైదయ్య, ఉయ్యాల నగేష్, గుణగంటి కృష్ణ, బత్తుల జనార్ధన్, బోడపట్ల జయమ్మ, జెర్రిపోతుల కృష్ణ, బట్టిపెల్లి నాగమల్లయ్య, బోడపట్ల సుదర్శన్, బుర్ర సుధాకర్, తాళ్లపల్లి నరసయ్య, సురుగు రాజేష్ గౌడ్, గుండగాని శ్రీను, కలగాని సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News