Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:06 PM

రూ.20.30 కోట్లతో కోదాడ–హుజూర్‌నగర్ బస్‌స్టేషన్లకు మహర్దశ

21-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మంత్రి ఉత్తమ్ కృషితో ప్రజా రవాణాకు కొత్త సొబగులు

ప్రయాణికుల సౌకర్యమే ప్రమాణం.. పనులు వేగవంతం చేయాలి

నిర్మాణ నాణ్యతలో రాజీ పడొద్దు: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక కృషితో కోదాడ,హుజూర్‌నగర్ పట్టణాల్లో ప్రజా రవాణా వ్యవస్థ సరికొత్త రూపును సంతరించుకోనుంది. కోదాడలో అధునాతన బస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.16.80 కోట్లు, హుజూర్‌నగర్ బస్‌స్టేషన్ పునరుద్ధరణ–ఆధునికీకరణకు రూ.3.50 కోట్లు కలిపి మొత్తం రూ.20.30 కోట్లతో రెండు ప్రధాన రవాణా కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు.ఈ రెండు బస్‌స్టేషన్ల నిర్మాణ ప్రణాళికలు, ప్రయాణికులకు కల్పించాల్సిన వసతులు, పనుల పురోగతిపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత నమూనాలను పరిశీలించిన ఆయన, పనులను వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.కీలక రవాణా కూడలిగా ఉన్న కోదాడలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక బస్‌స్టేషన్‌ను నిర్మించనున్నారు.ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ రెడ్డి, టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, చీఫ్ ఇంజనీర్ కవితతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

రూ.20.30 కోట్లతో కోదాడ–హుజూర్‌నగర్ బస్‌స్టేషన్లకు మహర్దశ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News