అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ కవిత ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు.
అంతకుముందు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చిరుమర్తి లింగయ్య ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.
గణేశుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్, యువశక్తి యువజన సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి