పురపాలక సంఘ కార్యాలయంలో ఘనంగా వర్ధంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు బహుజనులు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలు, అందించిన సేవలు చిరస్మరణీయమని చౌటుప్పల్ పురపాలక చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్ అధ్యక్షతన కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు బద్రి గాలయ్య, పాక చిరంజీవి, పిల్లలమర్రి మధుసూదన్, కో-ఆప్షన్ సభ్యుడు పస్తం గంగారామ్, నాయకులు దేప రాజు, ఉడుగు రమేష్, చిక్కా నరసింహ, బడుగు లక్ష్మయ్య, బడుగు మోహన్ బాబు, గోశిక శ్రీకాంత్, బడుగు బాలరాజు, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి