చిట్యాల: చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం ఆరు దరఖాస్తులు అందాయి. వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు ఫిర్యాదులు సమర్పించారు.
అందిన దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి 2, పంచాయతీరాజ్ శాఖకు 2, మున్సిపాలిటీకి 1, ఆర్‌అండ్‌బీ శాఖకు 1 దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, సమస్యలను నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రాధాన్యంతో పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి