Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:11 PM

తల్లి పాలు బిడ్డకు మొదటి టీకా

తల్లి పాలు బిడ్డకు మొదటి టీకా

తల్లి పాలు బిడ్డకు మొదటి టీకా
05-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా అని చిట్యాల మున్సిపల్ వైస్ ఛైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో బుధవారం ఐసీడీఎస్ సీడీపీఓ లావణ్య ఆధ్వర్యంలో ‘తల్లిపాల వారోత్సవాలు’ ఘనంగా నిర్వహించారు.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ వైస్ చైర్మన్ గుండబోయిన శ్రీలక్ష్మి సైదులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, అవి బిడ్డకు మొదటి టీకాగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, కనీసం రెండేళ్ల వరకు కొనసాగించాలని బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పించారు. ​ఈ సందర్భంగా 6 నెలల చిన్నారులకు అన్నప్రాశన చేయించడంతో పాటు, ఐసీడీఎస్ అందించిన అంగన్‌వాడీ విద్యార్థుల యూనిఫాంలను వైస్ చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ షబానా, కో-ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, 4వ వార్డు ప్రతినిధి కోనేటి ఎల్లయ్య, అంగన్‌వాడీ టీచర్లు దాడి అరుణ, జ్యోతి, అపర్ణ, బుజ్జమ్మ, కృష్ణవేణి, శోభారాణి, కోనేటి మమత, వరమ్మలతో పాటు పలువురు తల్లులు, బాలింతలు పాల్గొన్నారు.

Sthanikam

తల్లి పాలు బిడ్డకు మొదటి టీకా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News