Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:49 PM

అత్యవసర రక్తదానంతో మహిళకు ప్రాణాధారం

అత్యవసర రక్తదానంతో మహిళకు ప్రాణాధారం

అత్యవసర రక్తదానంతో మహిళకు ప్రాణాధారం
05-08-2026 182 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం

అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసి ఓ మహిళకు ప్రాణాధారంగా నిలిచిన సూర్యాపేట ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యంను పలువురు అభినందించారు.

సూర్యాపేట ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ టెక్నీషియన్ దొనకొండ సైదులు పెద్దమ్మ లక్ష్మమ్మ తీవ్ర రక్తహీనతతో చికిత్స పొందుతూ ఉండగా, ఆమెకు అత్యవసరంగా బీ–పాజిటివ్ (B+) రక్తం అవసరమైంది. విషయం తెలుసుకున్న వెంటనే అసోసియేషన్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం స్పందించి ఆస్పత్రికి చేరుకుని రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఆలేటి మాణిక్యం చేసిన సేవను అసోసియేషన్ సభ్యులు, బాధిత కుటుంబ సభ్యులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

అత్యవసర రక్తదానంతో మహిళకు ప్రాణాధారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News