Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

తల్లిపాలే పాపాయికి శ్రీరామరక్షణ: సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్

05-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అంకిరెడ్డిగూడెంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు, అన్నప్రాశన

పుట్టిన ప్రతి బిడ్డకూ తల్లిపాలే శ్రీరామరక్షణ అని, పసిపాపల శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు అమృతంలా ఉపయోగపడతాయని అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ అన్నారు. బుధవారం చౌటుప్పల్ మండలం, అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ (1, 2) కేంద్రాల ఆధ్వర్యంలో 'తల్లిపాల వారోత్సవాలు', 'ఆరోగ్య లక్ష్మి' కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలోని గర్భిణులు, బాలింతలు పోషకాహార లోపం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లల బరువు, శారీరక ఎదుగుదల వివరాలను అంగన్‌వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్న ఆయన, తల్లి-బిడ్డల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు.

​గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యకరమైన అలవాట్లు, పోషకాహారంపై చక్కటి కౌన్సిలింగ్, అవగాహన కల్పిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు నల్ల జయప్రద, సప్పిడి కల్పనలను సర్పంచ్ ఈ సందర్భంగా అభినందించారు. గ్రామంలో పుట్టబోయే ప్రతీ బిడ్డ ఆరోగ్యం, భవిష్యత్తు నిర్మాణంలో అంగన్‌వాడీ సిబ్బంది బాధ్యత ఎంతో కీలకమైనదని స్పష్టం చేశారు. అనంతరం కేంద్రంలో చిన్నారులకు ఘనంగా అన్నప్రాశన జరిపించారు.​ఈ కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు పెండెం లక్ష్మి, ఉపాధ్యాయులు లక్ష్మణాచారి, జి పద్మ ఎం పీ హెచ్ ఏ(ఎఫ్), అంగన్వాడి టీచర్స్, ఆశ వర్కర్స్ బొడిగె అమృత, బొల్లు అండాలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తల్లిపాలే పాపాయికి శ్రీరామరక్షణ: సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News