Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:00 PM

రాజాపేట గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

05-08-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించాలి.

ఆహార సరఫరాలో నిర్లక్ష్యం సహించం..

కాంట్రాక్టర్‌పై చర్యలు తప్పవు.

ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం రాజాపేట మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన గత పర్యటనలో సూచించిన పనుల పురోగతిని పరిశీలించారు.

హాస్టల్‌లో కిటికీల మరమ్మతులు, డోర్ల ఫిట్టింగ్, మెష్ ఏర్పాటు, వర్షపు నీటి లీకేజీల నివారణ పనులను పరిశీలించిన కలెక్టర్, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హాస్టల్‌లోని కొన్ని మరుగుదొడ్లు బ్లాక్ అయి వినియోగానికి అనుకూలంగా లేకపోవడాన్ని గుర్తించి, వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్‌కు, మెనూ ప్రకారం అందించాల్సిన గుడ్లు, చికెన్ వంటి ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా అందడం లేదని విద్యార్థులు తెలిపారు. దీంతో వెంటనే సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఒప్పందం ప్రకారం సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ విషయంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని, ఇకపై సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్, గోడలు, పైకప్పుల నుంచి ఊడిపోతున్న పెచ్చులను వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని గురుకుల కళాశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు అనుభవజ్ఞులైన లెక్చరర్ డాక్టర్ రాజును నియమించినట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్, ఎంఆర్వో, ఎంపీడీఓ నాగవేణి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

రాజాపేట గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News