Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో డయల్‌–112 అత్యవసర సేవలు ప్రారంభం బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 06:00 PM

విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాల బారిన పడుతున్నారు.

05-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

- సోషల్ మీడియా వేదికగా అత్యధికంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి.

- ఎక్కడో ఉన్న సైబర్ మోసగాడు ప్రజలకు అత్యాశ చూపి ఆర్థిక నష్టం కలిగిస్తున్నారు.

- అనవసరంగా వ్యక్తిగత ఫొటోలు, వివరాలు సోషల్ మీడియాలో పెట్టొద్దు.

సురక్షా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన ఎస్పీ నరసింహ ఐపీఎస్ . స్వతంత్ర మాసం ఆగస్టు 15 సందర్భంగా ఆగస్టు మాసంలో సురక్షా కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ కార్యక్రమాన్ని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారు ప్రణాళిక చేసినారు. దీనిలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూర్యాపేట రూరల్ పరిధిలో గల చందన ఫార్మసీ కళాశాల నందు అవగాహన పోస్టర్ ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘సురక్షా కా తిరంగా - సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట రూరల్ పరిధిలోని చందన ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ. స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా ఆగస్టు మాసమంతా ప్రజలను, యువతను సైబర్ నేరాలపై చైతన్య పరచడం జరుగుతుంది అని తెలిపారు.

విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాల బారిన పడుతున్నారని, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అత్యధికంగా ఈ మోసాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల అత్యాశను, అవసరాలను, అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకుని ఎక్కడో ఉన్న సైబర్ మోసగాళ్లు ప్రజలకు ఆర్థిక నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. తక్కువ పెట్టుబడితో తక్కువ రోజుల్లోనే ఎక్కువ లాభాలు వస్తాయని, తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దు. సోషల్ మీడియాలో, ఈమెయిల్స్ లేదా ఫోన్ ద్వారా అపరిచితులు సంప్రదిస్తే, బ్లూ లింక్స్ వస్తె వాటిని అనుసరించి వ్యక్తిగత వివరాలు, ఫొటోలను పంచుకోవద్దు అన్నారు. బహుమతులు వచ్చాయంటూ చేసే మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్నారు. సైబర్ మోసాల నివారణకు, ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రతి బుధవారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘సైబర్ జాగృక్త దివాస్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. యువత, విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అపరిచిత లింకులను క్లిక్ చేయకుండా సురక్షితంగా ఉండాలని ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

సైబర్ మోసాలు జరుగుతున్న విధానాన్ని పాటల రూపంలో పోలీస్ కళాబృందం విద్యార్థులకు వివరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ, రూరల్ ఎస్ఐ అనిల్, షీ టీం ఎస్ఐ నీలిమ, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది, రూరల్ పోలీసు సిబ్బంది ఉన్నారు.

Sthanikam

విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాల బారిన పడుతున్నారు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News