Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:59 PM

రైతు పక్షాన నిలిచిన నాయకుడు బోడేపూడి

రైతు పక్షాన నిలిచిన నాయకుడు బోడేపూడి

రైతు పక్షాన నిలిచిన నాయకుడు బోడేపూడి
05-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర బోడేపూడిదే

29వ వర్ధంతి సభలో సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్

ఎర్రుపాలెం, ఆగస్టు 5 (న్యూస్):

అమరజీవి బోడేపూడి వెంకటేశ్వరరావు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజానాయకుడని సీపీఎం ఎర్రుపాలెం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ అన్నారు. బోడేపూడి వెంకటేశ్వరరావు 29వ వర్ధంతి సందర్భంగా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవన్‌లో నిర్వహించిన స్మారక సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి ఎర్రుపాలెం శాఖ కార్యదర్శి దూదిగం బసవయ్య అధ్యక్షత వహించారు.

బోడేపూడి వెంకటేశ్వరరావు జీవితం ఓ తెరిచిన పుస్తకమని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ మధిర ఎమ్మెల్యేగా రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి అంటే అధికార కేంద్రాల్లో ఉండటం కాదని, సాగర్ జలాల సాధన కోసం కాల్వల వెంట తిరిగి రైతుల కోసం పోరాడిన నాయకుడని గుర్తుచేశారు.

మంచినీటి సదుపాయం, ఇళ్ల స్థలాల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో రాజకీయాలకు అతీతంగా సేవలందించిన నిస్వార్థ నాయకుడు బోడేపూడి అని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ చేపట్టే ప్రతి ప్రజా, రైతాంగ పోరాటానికి ఆయన జీవితం నేటికీ స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు విత్తనాలు, గిట్టుబాటు ధరలు, ఎరువులు, సబ్సిడీల నుంచి క్రమంగా దూరమవుతున్నారని విమర్శించారు. నూతన ఆర్థిక విధానాలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రభావంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, రైతుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గామసు జోగయ్య, నాగులవంచ వెంకట రామయ్య, నక్కా పుల్లారావు, గొబ్బూరి కృష్ణంరాజు, అంజయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతు పక్షాన నిలిచిన నాయకుడు బోడేపూడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News