Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:14 PM

భారీ వర్షాలు.. అప్రమత్తతే ప్రాణరక్షణ: ప్రజలకు ఎస్సై దుర్గా రెడ్డి కీలక సూచనలు

04-08-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కంగ్టి పోలీస్ స్టేషన్ ఎస్సై దుర్గా రెడ్డి సూచించారు. వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపానికి వెళ్లకుండా ఉండాలని, వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. పాత ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, పూరి గుడిసెల్లో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. రైతులు కూడా ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్ల కింద నిలబడకుండా, వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ప్రమాదం, రహదారులు దెబ్బతినడం, చెట్లు కూలిపోవడం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే కంగ్టి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రతే పోలీసు శాఖకు అత్యంత ముఖ్యమని, అధికారుల సూచనలు పాటిస్తూ పరస్పరం సహకరించి వర్షాకాలాన్ని సురక్షితంగా ఎదుర్కోవాలని ఎస్సై దుర్గా రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Sthanikam

భారీ వర్షాలు.. అప్రమత్తతే ప్రాణరక్షణ: ప్రజలకు ఎస్సై దుర్గా రెడ్డి కీలక సూచనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News