Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:00 PM

డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం. దోస్తు స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ విడుదల. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం.

05-08-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఇప్పటివరకు అవకాశం కోల్పోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించినట్లు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం తెలిపారు. దోస్తు స్పెషల్ డ్రైవ్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు నిర్దేశిత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 6 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆగస్టు 6 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్ల ద్వారా కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. ఆగస్టు 14న సీట్ల కేటాయింపు జరగనుండగా, 14 నుంచి 18 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఆగస్టు 17, 18 తేదీల్లో ఇంటర్మీడియట్ ఒరిజినల్ టీసీతో పాటు ఇతర విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో కళాశాలకు హాజరై అడ్మిషన్ కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన తెలిపారు.ఇప్పటికే కళాశాలలో అడ్మిషన్ కన్ఫర్మేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంట్రా కాలేజ్ ఫేజ్–2 ద్వారా ఆగస్టు 20, 21 తేదీల్లో తమ దోస్త్ వ్యక్తిగత లాగిన్‌లో కోర్సు మార్పు కోసం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, ఇందుకు సంబంధించిన సీట్ల కేటాయింపు ఆగస్టు 22న జరుగుతుందని వివరించారు.

"డిగ్రీ ప్రవేశాలకు ఇదే చివరి అవకాశం. ఇప్పటివరకు ఏ కళాశాలలోనూ ప్రవేశం పొందని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. అధిక సంఖ్యలో విద్యార్థులు చేరి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలి" అని ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం పిలుపునిచ్చారు.

Sthanikam

డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం. దోస్తు స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ విడుదల. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News