Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దండు మల్కాపురంలో గ్రామసభ రసాభాస కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 04, 2026 11:46 PM

నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీ గడువు పొడిగింపు..

నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీ గడువు పొడిగింపు..

నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీ గడువు పొడిగింపు..
August 04, 2026 09:31 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav



ఎంజియూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు, ఏజెన్సీ నిర్వాహకులు..

రోస్టర్, రిజర్వేషన్లు పాటించకుండా అక్రమ నియామకాలపై విచారణకు డిమాండ్...

నల్గొండ : నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజియూ)లో ఔట్‌సోర్సింగ్ సేవల టెండర్ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ బిఆర్ఎస్ పార్టీ నల్గొండ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, పలు ఏజెన్సీల నిర్వాహకులు మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో ఔట్‌సోర్సింగ్ సేవల నిమిత్తం ఇటీవల అధికారులు టెండర్ ప్రక్రియ చేపట్టారని తెలిపారు. అర్హత కలిగిన పలు ఏజెన్సీలు టెండర్‌లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ, గతంలో సేవలు అందించిన భార్గవి ఎంటర్‌ప్రైజెస్‌కే లబ్ధి చేకూర్చేలా విశ్వవిద్యాలయ అధికారులు సహకారం అందించారని ఆరోపించారు. టెండర్ నిబంధనలను పక్కనపెట్టి సదరు ఏజెన్సీకే మరో సంవత్సరం పాటు గడువు పొడిగించడం ఏమాత్రం తగదన్నారు.

రిజర్వేషన్లు, రోస్టర్ పక్కనపెట్టి అక్రమాలు..

గతంలో ఇదే ఏజెన్సీ ద్వారా చేపట్టిన ఔట్‌సోర్సింగ్ నియామకాలలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నియామకాల్లో 100 పాయింట్ల రోస్టర్ విధానాన్ని, రిజర్వేషన్ నిబంధనలను పాటించలేదని పేర్కొన్నారు. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ మార్గదర్శకాలతో పాటు క్రీడాకారులు, మాజీ సైనికుల (Ex-Servicemen) కోటాను సైతం అమలు చేయకుండా అర్హులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. నిబంధనలను ఉల్లంఘించిన భార్గవి ఎంటర్‌ప్రైజెస్‌పై వెంటనే సమగ్ర విచారణ జరిపి, సంబంధిత ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని, వర్సిటీలో పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించాలని వారు రిజిస్ట్రార్‌ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏజెన్సీ నిర్వాహకులు, నాయకులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News