జజ్జులరావుపేటలో పార్థివదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
జజ్జులరావుపేట మాజీ ఎంపీటీసీ నవిలే సుగుణ భర్త నవిలే కొమరయ్య గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొమరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కొమరయ్య మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కూసుమంచి మాజీ ఎంపీపీ బానోత్ శ్రీను నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల జీవన్ రెడ్డి, మాజీ సర్పంచ్ చాట్ల పరుశురాం, శేఖర్ రెడ్డి, జిల్లపల్లి ఉప్పయ్య తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి