Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:01 PM

సంస్థాన్ నారాయణపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ.

04-08-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రికార్డులు, పరిశుభ్రత, ప్రజా సేవలపై ప్రత్యేక దృష్టి.. సిబ్బందికి పలు సూచనలు.

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అక్షాన్ష్ యాదవ్ (ఐపీఎస్) మంగళవారం సంస్థాన్ నారాయణపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీ బుక్‌తో పాటు వివిధ రికార్డులను పరిశీలించిన ఎస్పీ.. నమోదు ప్రక్రియ నిబంధనల మేరకు జరుగుతోందా లేదా అనే అంశాన్ని తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పరిశుభ్రత, నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పనితీరును సమీక్షించారు.

తనిఖీ సందర్భంగా ఎస్‌హెచ్‌వో జగన్ పోలీస్ స్టేషన్ పనితీరు, చేపడుతున్న కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితులపై ఎస్పీకి వివరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌లో క్రమశిక్షణ, రికార్డుల సమర్థవంతమైన నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, ప్రజలకు అనుకూలమైన పోలీసింగ్‌ను అమలు చేయాలని ఆదేశించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

Sthanikam

సంస్థాన్ నారాయణపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News