Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

సైబర్ మోసాలపై జాగ్రత్త! సీఐ మన్మధ కుమార్

04-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కాలేజీ విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన

సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి ఉపయోగించాలి తప్ప సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ సూచించారు. మంగళవారం బంగారిగడ్డలోని 'టిజిఆర్ఎస్ అండ్ జూనియర్ కాలేజీ'లో విద్యార్థులకు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్లు, బెట్టింగ్ యాప్‌లు, ఫేక్ యూపీఐ లింకులు, సోషల్ మీడియా మోసాలు, 'డిజిటల్ అరెస్ట్' పేరిట ముఠాలు వేధిస్తున్నాయని, వీటి పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫేక్ కాల్స్, లింకులను నమ్మవద్దని, ఓటీపీ, పిన్ నంబర్లు, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. వ్యక్తిగత ఫోటోలు, సమాచారాన్ని సోషల్ మీడియాలో పంపవద్దన్నారు. పొరపాటున సైబర్ నేరాలకు గురై డబ్బులు పోగొట్టుకుంటే భయపడకుండా వెంటనే 1930 ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

సైబర్ మోసాలపై జాగ్రత్త! సీఐ మన్మధ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News