Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:46 AM

అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం

11-07-2026 142 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాపురం గ్రామంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పుట్టపర్తి శక్తి బృందం–2 ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోక్సో (POCSO) చట్టం, బాల్య వివాహాల వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలు, మైనర్ల ప్రేమ వ్యవహారాల వల్ల ఎదురయ్యే సమస్యలు మరియు వాటి న్యాయపరమైన పరిణామాలపై వివరంగా అవగాహన కల్పించారు.

18 సంవత్సరాల లోపు బాలికల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి రోజువారీ కార్యకలాపాలను గమనించాలని, ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాలకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అలాగే మహిళలు మరియు బాలికల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే 112 (ఎమర్జెన్సీ), 181 (మహిళల హెల్ప్‌లైన్), 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్), 1930 (సైబర్ మోసాల హెల్ప్‌లైన్) సేవల గురించి వివరించారు.

తమ గ్రామం లేదా పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించిన వెంటనే 112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం, మహిళలు మరియు చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయడం కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలను జిల్లా పోలీసు శాఖ నిరంతరం నిర్వహిస్తుందని తెలిపారు.

Sthanikam

అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News