Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:06 AM

బొజ్జగూడెం తండా అంగన్వాడిలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా

04-08-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

అనంతగిరి మండల పరిధిలోని బొజ్జగూడెం తండా గ్రామంలోని అంగన్వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఆగస్టు 1 నుండి 7 వరకు జరుగుతున్న ఈ వారోత్సవాలు అంగన్వాడి టీచర్లు భువన,వీరమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.దీనిలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.అంగన్వాడి టీచర్లు,ఆశా వర్కర్లు,గర్భిణులు, బాలింతలు,చిన్నారులు చేతిలో బ్యానర్లు,నినాదాలతో గ్రామ ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వెళ్లారు.తల్లిపాలు బిడ్డకు మొదటి టీకా6 నెలల వరకు తల్లిపాలే అంటూ నినాదాలు చేశారు.అనంతరం అంగన్వాడి కేంద్రంలో సమావేశం నిర్వహించి ఫోటోలో కనిపిస్తున్నట్లుగా తల్లులు తమ పిల్లలతో కలిసి కూర్చుని చాక్, స్లేట్లతో అక్షరాలు దిద్దిస్తూ ఆటపాటలతో కార్యక్రమాన్ని సందడిగా మార్చారు.ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ పుట్టిన వెంటనే గంటలోపు తల్లిపాలు ఇవ్వడం, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల బాగుంటుందని తెలిపారు. డబ్బా పాల వల్ల అనారోగ్యాలు వస్తాయని, తల్లిపాలే సంపూర్ణ ఆహారమని అవగాహన కల్పించారు.గర్భిణులు, బాలింతలకు పోషకాహారం గురించి వివరించారు.చిన్నారులకు బొమ్మలు, పుస్తకాలు పంపిణీ చేశారు.తల్లిపాలు ఆరోగ్యానికి పునాదనే నినాదంతో బ్యానర్ ను ప్రదర్శించారు.కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రతి తల్లి తన బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని టీచర్లు పిలుపునిచ్చారు.

Sthanikam

బొజ్జగూడెం తండా అంగన్వాడిలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News