Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:06 AM

ఆటో ప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

04-08-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన పలువురు నాటు కూలీలు కూలి పనుల నిమిత్తం ఆటోలో ప్రయాణిస్తుండగా, మార్గమధ్యలో మంగళవారం రత్నవరం గ్రామం సమీపంలో ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పదకుండు మంది కూలీలు గాయపడగా,వారిని వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు.అలాగే, ప్రమాదంలో గాయపడిన కూలీలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ,వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Sthanikam

ఆటో ప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News